Bhasha Pustak Scheme | న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో సరికొత్త పథకానికి కేంద్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. భారతీయ భాషా పుస్తక్ పేరిట తీసుకొస్తున్న ఈ పథకం ద్వారా స్కూల్, హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు ఉపయోగపడేలా డిజిటల్ పుస్తకాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ పథకం ద్వారా ప్రాంతీయ భాషల్లోకి డిజిటల్ పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా అనేక మంది చదువుకునేందుకు అవకాశాలు లభిస్తాయని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర విద్యాశాఖ, యూజీసీ సంయుక్తాధ్వర్యంలో 2024 జూలైలో ప్రారంభమైన ఏఎస్ఎంఐటీఏ పథకం ద్వారా రానున్న ఐదేండ్లలో 22 ప్రాంతీయ భాషల్లో 22 వేల పుస్తకాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.