న్యూఢిల్లీ: ప్రముఖ భరతనాట్య కళాకారిణి సరోజ వైద్యనాథన్ గురువా రం తెల్లవారుజాము 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆ మె కోడలు రమ వైద్యనాథన్ చెప్పారు. రెండు రోజుల క్రిత మే ఆమె 86వ పుట్టి న రోజు జరుపుకున్నట్లు తెలిపారు.
సరోజ కొద్ది కాలం నుం చి క్యాన్సర్తో బాధపడుతున్నారని చెప్పారు. భరతనాట్యం, కర్ణాటక సంగీతాలకు ఆమె అందించిన విశేష సేవలకు గుర్తింపుగా 2002లో ‘పద్మశ్రీ’, 2013లో ‘పద్మభూషణ్’ పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది.