Hanuman | న్యూఢిల్లీ: కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత చాట్‌జీపీటీకి పోటీగా దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్‌జీపీటీ ‘హనుమాన్’ త్వరలో అందుబాటులోకి రానున్నది. భారత్ జీపీటీ గ్రూపు ఏఐ మాడల్ హనుమాన్ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతున్నది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, దేశవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ఐఐటీల నేతృత్వంలోని కన్సార్టియం ‘హనుమాన్’ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న చాట్‌జీపీటీ లాంటి సేవలను ఇది కూడా అందించనున్నది. ఈ లాంగ్వేజ్ మాడల్ తెలుగు, హిందీ, తమిళం సహా 11 దేశీయ భాషల్లో సేవలందిస్తుంది.