Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలంతా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేసి ఆశీస్సులు అందిస్తే అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళ్లరని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, ఇండియా విపక్ష కూటమి అధికారంలోకి వస్తాయని, కాషాయ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తి లేదని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి ఆప్ పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్ధి మహాబల్ మిశ్రాకు మద్దతుగా ఆదివారం జరిగిన రోడ్‌షోలో భగవంత్ మాన్ పాల్గొన్నారు. ఢిల్లీ, పంజాబ్‌లో ఆప్ అత్యధిక లోక్‌సభ స్ధానాలను కైవసం చేసుకుంటుందని మాన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక తాను ఢిల్లీలో ప్రజలందరికీ వైద్య సేవలు, మందులు అందుబాటులోకి తీసుకువస్తే తనకు జైలులో 15 రోజుల పాటు ఇన్సులిన్, డయాబెటిక్ మందులు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారని కేజ్రీవాల్ ఆరోపించారు. కాగా, ఢిల్లీలోని 7 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈనెల 25న పోలింగ్ జరగనుంది. ఏడు దశల పోలింగ్ అనంతరం జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Arvind Kejriwal | ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ భేటీ.. కీలక ఎమ్మెల్యే మిస్సింగ్