ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రుల ప్రమాణ స్వీకారం కొన్ని రోజుల తర్వాతే ఉంటుందని ఆప్ వర్గాలు పేర్కొంటున్నాయి. పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ బుధవారం రోజున ప్రమాణ స్వీకారం చేస్తారు. సంప్రదాయం ప్రకారం రాజ్భవన్లో కాకుండా భగత్ సింగ్ సొంత గ్రామమైన ఖాట్కర్ కలాన్లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. 117 స్థానాలకు గాను 92 సీట్లలో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆప్ సీఎం అభ్యర్థి భగవంత్ మాన్ గవర్నర్ తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన గవర్నర్కు విన్నవించారు. మరోవైపు శనివారం రోజున ఆప్ నూతన ఎమ్మెల్యేల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భగవంత్ మాన్ను ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.