న్యూఢిల్లీ, ఆగస్టు 27: ‘స్మిషింగ్’గా పిలిచే కొత్త ఆన్లైన్ మోసం పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. సెక్యూరిటీ వెరిఫికేషన్, అకౌంట్ అప్డేట్ పేరిట బ్యాంకు ఖాతా వివరాలు, క్రెడిట్ కార్డు నంబర్లు, లాగిన్ వివరాలు రాబట్టుకొనేందుకు సైబర్ కేటుగాళ్లు ఎస్ఎంఎస్లు పంపుతారు. అచ్చం బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, ప్రముఖ కంపెనీల పేరుతో మేసేజ్లు చేస్తారు. అత్యవసరం సృష్టించి, పౌరులు వెంటనే స్పందించేలా వాటిని పంపిస్తారు. ఎవరైనా స్మిషింగ్ స్కామ్ బారిన పడివుంటే, 1930 డయల్ చేయడం లేదా cybercrime.gov.in వైబ్సైట్లో ఫిర్యాదు చేయాలని కేంద్రం సూచించింది.