న్యూఢిల్లీ: కొందరు మోటివేషనల్ స్పీకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు 10 రోజుల ఎంబీఏ క్రాష్ కోర్స్ పేరుతో తప్పుదోవ పట్టిస్తున్నారని ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) విద్యార్థులను హెచ్చరించింది.
ఏఐసీటీఈ విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, పీజీ డిగ్రీ రావడానికి ఉపయోగపడే ఎంబీఏ లేదా మేనేజ్మెంట్ కోర్సులతో సహా టెక్నికల్ కోర్సులను ఆఫర్ చేయాలంటే ఏఐసీటీఈ అనుమతి, ఆమోదం తప్పనిసరి. ఏఐసీటీఈ అనుమతి లేకుండా ఈ కోర్సులను సంస్థలు లేదా విశ్వవిద్యాలయాలు ఆఫర్ చేయకూడదు. ఎంబీఏ రెండేళ్ల వ్యవధిగల కోర్సు, దీనిని కేవలం 10 రోజుల్లో పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇటువంటి మోసపూరిత ప్రకటనల బారిన పడవద్దని విద్యార్థులను ఏఐసీటీఈ కోరింది.