Bengaluru woman | బెంగళూరులో 14 ఏళ్ల కూతురును చంపిన తల్లి.. తర్వాత ఆమె కూడా ఆత్మహత్య
Bengaluru woman : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఒక మహిళ తన 14 ఏళ్ల కూతురును ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది.
Bengaluru woman : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఒక మహిళ తన 14 ఏళ్ల కూతురును ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రోజు ఉదయం అయినా తల్లీ, కూతురు ఇంట్లోంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి ఇద్దరి మృతదేహాలు కనిపించాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు, వైట్‌ఫీల్డ్ పరిధిలో ఉండే సువర్ణ (45) అనే మహిళ, తన 14 ఏళ్ల కూతురు తారుణ్యను ఇంట్లోనే ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అనంతరం ఆమె కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త చంద్రశేఖర్ ఇంట్లో లేడు. ఆయన ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కాంపౌడర్గా డ్యూటీ చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. తన కూతురు తారుణ్య హత్యపై ఆమె తండ్రి, సువర్ణ భర్త చంద్రశేఖర్ ఇచ్చిన ఫిర్యాదు ఒకటికాగా, సువర్ణ మరణంపై ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మరోటి. ఈ ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇద్దరి మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
సువర్ణ ముందుగా తన కూతురును చంపి, ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. సువర్ణ కొంత కాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన కూతురు గురించి ఆమె నిరంతరం ఆవేదన చెందేదని తెలిపారు. ఈ కారణాలతోనే ఈ దారుణానికి పాల్పడిందా లేదా మరేదైనా కారణం ఉందా అనేది విచారణలో తేలుతుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Bengaluru
- Daughter
- Whitefield
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

