Woman died : మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయిన బెంగళూరు మహిళ (Bengalore woman) మరణించింది. ఆదివారం సౌపర్ణిక నది (Souparnika river) లో ఆమె మృతదేహం దొరికింది. ఉడుపి జిల్లా (Udupi district) కొల్లూరు (Kolluru) లోని మూకాంబిక ఆలయం (Mukambika temple) వద్ద బెంగళూరుకు చెందిన మహిళ కనిపించకుండా పోయింది. కొల్లూరు మీదుగా ప్రవహించే సౌపర్ణిక నదిలో ఆదివారం ఆమె మృతదేహం లభ్యమైంది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన వసుధ చక్రవర్తి (45) బెంగళూరు త్యాగరాజనగరలోని సీఆర్ గోవిందరాజులు కుమార్తె. ఆమె తరచూ కొల్లూరులోని మూకాంబిక ఆలయానికి వెళ్లి దేవి దర్శనం చేసుకుని వెళ్లేవారు. ఎప్పటిలాగే ఆగస్టు 28న కూడా ఆమె సొంత కారులో బెంగళూరు నుంచి కొల్లూరుకు వచ్చారు. ఓ లాడ్జిలో బస చేశారు. మరుసటి రోజున తల్లిదండ్రులు ఆమెకు కాల్ చేయగా స్పందన లేదు. దాంతో వారు హుటాహుటిన కొల్లూరుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలుచోట్ల సీసీ కెమెరాలను పరిశీలించారు. స్థానికులను విచారించారు. ఆ రోజు ఆమె చాలా టెన్షన్‌గా కనిపించారని, ఒంటరిగా, వేగంగా వెళ్తూ ఉండగా చూశామని కొందరు చెప్పారు. ఆమె సమీపంలోని సౌపర్ణిక నదివైపు వెళ్లారని, నదిలోకి దూకారని, ప్రవాహంతోపాటు కొట్టుకుపోయారని మరి కొందరు తెలిపారు. దాంతో స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో నదిలో ఆమె కోసం గాలించారు.
చివరికి ఆదివారం నాడు నదిలో ఆమె మృతదేహం దొరికింది. దాంతో పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఆమె మరణానికిగల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఇది హత్యనా, ఆమె హత్యనా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.