బెంగుళూరు: కర్నాటక రాజధాని బెంగుళూరులో ఉన్న మూడు పెద్ద హోటళ్లకు బాంబు బెదిరింపు(Bomb Threats) మెయిల్స్ వచ్చాయి. దీంట్లో ప్రఖ్యాత ఒటెరా హోటల్ కూడా ఉన్నది. ప్రస్తుతం ఒటెరా హోటల్ వద్ద బాంబు స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సౌత్ ఈస్ట్ బెంగుళూరు డీసీపీ తెలిపారు. బధువారం రోజున ఢిల్లీలో కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. నార్త్ బ్లాక్ ప్రాంతంలో ఆ కాల్స్ వచ్చినట్లు తేలింది. హోంమంత్రి ఆఫీసు ఉండే ఆ ప్రాంతంలో బెదిరింపులు వచ్చాయి. కానీ ఆ బెదిరింపులు ఉత్తవే అని అధికారులు గుర్తించారు. మే 14వ తేదీన బెంగుళూరులోని 8 స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ కాల్స్‌ను కూడా ఉత్తవే అని అధికారులు తేల్చారు.