Copyright violation | రాహుల్ జోడో హ్యాండిల్‌పై తాత్కాలిక చర్యలు.. ట్విట్టర్‌కు బెంగళూరు కోర్టు ఆదేశం
Copyright violation | రాహుల్ భారత్ జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిల్ కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించిందని బెంగళూరు కోర్టు నిర్ధారించింది. కాంగ్రెస్‌తోపాటు జోడో యాత్ర ట్విట్టర్ హ్యాండిళ్లను తాత్కాలిక బ్లాక్ చేయాలని ట్విట్టర్ యాజమాన్యానికి ఆదేశించింది.
Copyright violation | రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు సంబంధించిన కేసులో బెంగళూరు కోర్టు ఒకటి సోమవారం తీర్పునిచ్చింది. కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు కాంగ్రెస్, భారత్ జోడో యాత్రకు ప్రచారానికి వాడుతున్న ట్విట్టర్ హ్యాండిళ్లను తాత్కాలికంగా బ్లాక్ చేయాలని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యాజమాన్యానికి కోర్టు ఆదేశించింది.
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు సంబంధించిన ఒక వీడియోలో కేజీఎఫ్-2 సినిమా పాటను కాంగ్రెస్ వాడుకున్నదని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఎంఆర్టీ మ్యూజిక్ సంస్థ చేసిన ఫిర్యాదు చేసింది. హిందీలో కేజీఎఫ్-2 పాటల హక్కులను పొందేందుకు తాము పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినట్లు ఈ సంస్థ తన ఫిర్యాదులో పేర్కొన్నది. ఈ ఫిర్యాదును విచారించిన బెంగళూరు కోర్టు.. ఇది ముమ్మాటికీ కాపీరైట్ నిబంధనల ఉల్లంఘనే అని నిర్ధారించింది. అయితే, తీవ్రమైన చర్యలు కాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ట్విట్టర్ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
Adluri Lakshman | తెగిపడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తప్పిన ప్రమాదం
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

