బెంగళూరు : బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్ట్ నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఇటీవల నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నాలుగు రాష్ర్టాల్లో ఓటర్ కార్డులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై తమ ముందు విచారణకు హాజరు కావాలని కోర్ట్ ఇప్పటి వరకు రెండు సార్లు ప్రకాశ్ రాజ్‌కు సమన్లు జారీ చేసింది.
విచారణకు ఆయన హాజరు కాకపోవడంతో ఈ వారెంట్ జారీ చేసింది. కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశ్ రాజ్‌కు ఓటర్ కార్డులు ఉన్నాయని 2019లో దిలీప్ కుమార్ అనే న్యాయవాది హలసూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు, ఈసీ స్పందించకపోవడంతో కోర్టుకు ఫిర్యాదు చేశారు.