బెంగుళూరు: బెంగుళూరుకు చెందిన ఐటీ ప్రొఫెషనల్స్(Bengaluru Couple) దానిష్ అబ్ది, వృషాలి ప్రసాదే ప్రపంచ రికార్డు సృష్టించారు. శ్రీలంక నుంచి భారత్‌కు కలిసి స్విమ్మింగ్ చేశారు. రెండు దేశాల మధ్య ఈత కొట్టిన తొలి జంటగా రికార్డు క్రియేట్ చేశారు. చరిత్రాత్మకమైన రామసేతు మార్గంలో ఆ కపుల్ స్విమ్మింగ్ చేసింది. పాల్క్ జలసంధి సుమారు 32 కిలోమీటర్ల దూరం ఉంటుంది. శ్రీలంకలోని తలైమన్నార్‌లో మే 7వ తేదీన ఉదయం 4.30 నిమిషాలకు ఈ జంట స్విమ్మింగ్ స్టార్ట్ చేసింది. తమిళనాడులోని థనుష్కోటికి సాయంత్రం 3.15 నిమిషాలకు చేరుకున్నారు. సుమారు 10 గంటల 45 నిమిషాల పాటు ఆ జంట స్విమ్ చేసింది.
ఈతకు చెందిన కొన్ని వీడియోలను రిలీజ్ చేశారు. సముద్ర జలాలు ఎగిసిపడుతున్నా.. ఆ ఇద్దరూ ధైర్యంగా స్విమ్మింగ్ కొనసాగించారు. సూర్యోదయానికి ముందే ఆ కపుల్ సముద్రంలోకి దూకిన విజువల్స్‌ను రిలీజ్ చేశారు. సేఫ్టీ చర్యలు తీసుకుని ఈ స్టంట్ చేపట్టారు. సపోర్టు బోట్లు, పారామెడిక్స్, భారత కోస్టు గార్డు సిబ్బంది ఆ స్విమ్మర్లతోనే ఉన్నారు.
ఆ జంట ప్రదర్శించిన సాహసం, తెగువ, ధైర్యం, క్రమశిక్షణను అందరూ మెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో వారిపై ప్రశంసలు కురుస్తున్నాయి. భార్యాభర్తలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కావడం మరో విశేషం. అయితే ఆ ఇద్దరూ నాలుగేళ్ల క్రితమే స్విమ్మింగ్ శిక్షణ తీసుకున్నారు.
View this post on Instagram
A post shared by Vrushali & Danish | Fit Couple • Sea Swimmers • Triathletes (@our.life.in.miles)