Bengaluru Couple: సైడ్ మిర్రర్‌కు బైక్ తగిలిందని 2 కి.మీ వెంటాడి కారుతో ఢీకొట్టి చంపిన జంట.. వీడియో
Bengaluru Couple: కారులో వెళ్తున్న ఓ జంట ప్రతీకారం తీర్చుకున్నది. తమ కారు మిర్రర్‌కు తాకిన ఓ బైకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ కేసులో ఆ బైకర్ మృతిచెందాడు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ అవుతున్నది. కారు నడిపిన కపుల్‌ను అరెస్టు చేశారు.
బెంగుళూరు: కారులో వెళ్తున్న ఓ జంట(Bengaluru Couple) .. కావాలనే ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఆ ఘటనలో బైకర్ మృతిచెందగా, పిలియన్ రైడర్ గాయపడ్డాడు. ఈ కేసులో బెంగుళూరు పోలీసులు కారులో ఉన్న జంటను అరెస్టు చేశారు. ఈ ఘటనకు చెందిన వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. అక్టోబర్ 25వ తేదీన రాత్రి 11.30 తర్వాత పుత్తెనహల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యాక్సిడెంట్ జరిగింది. వేగంగా వెళ్తున్న కారు.. ఓ టూవీలర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న రైడర్ దర్శన్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని స్నేహితుడు వరుణ్ మాత్రం గాయపడ్డాడు. దీన్ని ప్రమాదవశాత్తు మరణంగా జేపీ నగర్ పోలీసులు తొలుత కేసు నమోదు చేశారు.
కానీ సీసీటీవీ ఫూటేజ్‌ను పరిశీలించిన పోలీసులకు అనుమానం వచ్చింది. కావాలనే బైక్‌ను ఛేజ్ చేసి ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనపై డీఎస్పీ లోకేశ్ జగలాసర్ దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. టూవీలర్ రైడర్స్ ఈ ఘటనకు ముందు కారును ఢీకొట్టారు. బైక్‌ను దూకుడుగా నడపడంతో కారుకు చెందిన సైడ్ మిర్ర్ పగిలిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆ కారు డ్రైవర్ తన వాహనాన్ని రివర్స్ చేసి టూవీలర్‌ను వెంటాడాడు. టూవీలర్‌ను ఢీకొట్టడంతో దాని రైడర్ అక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు డీసీపీ తెలిపారు. 2 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసినట్లు చెప్పారు.
కారు నడిపిన నిందితుడు ఓ పీఈడీ టీచర్. యాక్సిడెంట్ తర్వాత తన భార్యతో కలిసి ఆ ప్రదేశానికి వచ్చాడు. గుర్తు పట్టకుండా ఉండేందుకు వాళ్లు మాస్క్‌లు ధరించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో పడి ఉన్న తమ కార్లకు చెందిన విరిగిన భాగాలను తీసుకెళ్లారు. సాక్ష్యాధారాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో అలా చేశారు. భారతీయ న్యాయ సంహిత చట్టం కింద పుత్తెనహల్లి పోలీసు స్టేషన్లో ఆ జంటపై కేసు బుక్ చేశారు.
Bengaluru Road Rage Tragedy
A Kalaripayattu trainer & his wife allegedly rammed their car into a delivery agent’s bike after its handle brushed their mirror near JP Nagar killing him on the spot. The pillion rider survived.
pic.twitter.com/uQS5oq0hgo— Nishkama_Karma (@Nishkama_Karma1) October 29, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

