బెంగళూరు, జూన్ 3: ఎడతెరపి లేని వర్షాలతో బెంగళూరు తడిసిముద్దవుతున్నది. ఆదివారం (జూన్ 2) ఒక్కరోజు నగరంలో 111 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, దీంతో గత 133 ఏండ్ల రికార్డ్ బద్దలైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సైంటిస్ట్ ఎన్ పువియరాసన్ చెప్పారు.
ఒక్క రోజు అత్యధిక వర్షపాతం.. 1891, జూన్ 16న నమోదుకాగా, మళ్లీ ఇన్నేండ్లకు ఆ రికార్డ్ బద్దలైందని ఐఎండీ పేర్కొన్నది. ఈసారి జూన్ 1, 2 తేదీల్లో మొత్తం 140.7 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. భారీ వర్షాల కారణంగా అనేక చెట్లు కూలాయి. పలు ప్రాంతాలు నీటమునిగాయి. ముఖ్యంగా జయనగర్లో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నది.