కోల్కతా: పశ్చిమ బెంగాల్ రెండో, ఆఖరి విడత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 142 శాసనసభ స్థానాలకు బుధవారం పోలింగ్ జరుగనుంది. ఈ స్థానాల్లో 123 స్థానాలను 2021ఎన్నికల్లో టీఎంసీయే గెల్చుకుంది. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఈ ప్రాంతం మమతకు గట్టి మద్దతుగా నిలిచింది. మొదటి విడతలో 93.19 శాతంలో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. అయితే సర్ పేరిట రాష్ట్రంలో జరిగిన ఓట్ల తొలగింపు అధికార టీఎంసీని భయపెడుతున్నది. ‘సర్’ కింద సుమారు 25 నియోజకవర్గాల్లో తొలగించిన ఓట్ల సంఖ్య గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఎక్కువగా ఉండటం ఆ పార్టీని కలవరపెడుతున్నది.