Election Commission of India: తృణమూల్ కాంగ్రెస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
Election Commission : భయంలేని, హింసలేని, బెదిరింపులేని .. ఎన్నికలు బెంగాల్లో జరగనున్నట్లు ఈసీ చెప్పింది. ఇవాళ బెంగాల్ సర్కారుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆల్టిమేటం జారీ చేసింది. మరో వైపు ఇవాళ జరిగిన ఓ భేటీలో టీఎంసీ, సీఈసీ మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది.
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఈసారి బెంగాల్లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిర్భయంగా జరుగుతాయని పేర్కొన్నది. ఈసీ ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఓ ట్వీట్ పోస్టు చేసింది. హింస లేకుండా, బెదిరింపులు లేకుండా, తనిఖీలు లేకుండా, పోలింగ్ బూత్‌ల్లో జామ్ లేకుండా ఎన్నికల నిర్వహణ జరగనున్నట్లు ఈసీ పేర్కొన్నది. ఇక ఆ రాష్ట్రానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. టీఎంసీకి సూటిగా హెచ్చరిక చేస్తున్నట్లు తన ట్వీట్లో ఈసీ చెప్పింది. కచ్చితంగా ఈసారి బెంగాల్లో ఎన్నికలు నిర్భయంగా, స్వేచ్ఛగా జరుగుతాయని పేర్కొన్నది.
चुनाव आयोग की तृणमूल कांग्रेस को दो टूक
पश्चिम बंगाल में इस बार चुनाव:
भय रहित,
हिंसा रहित,
धमकी रहित,
प्रलोभन रहित,
छापा रहित,
बूथ एवं सोर्स जामिंग रहित होकर ही रहेंगेECI’s Straight-talk to Trinamool Congress
This time, the Elections in West Bengal would surely be :… pic.twitter.com/p5fM8Uu337
— Election Commission of India (@ECISVEEP) April 8, 2026
అయితే ఇవాళ ఉదయం సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తృణమూల్ నేతలు కలిశారు. అక్కడ టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ .. సీఈసీపై గట్టిగా అరిచినట్లు తెలిసింది. ఆ సమయంలో సీఈసీ జ్ఞానేశ్, డెరిక్ ఒబ్రెయిన్ మధ్య వాగ్వాదం నడిచింది. తమను వెళ్లిపోవాలని సీఈసీ అరిచినట్లు ఒబ్రెయిన్ ఆరోపించారు. కానీ టీఎంసీ నేత చేసిన వ్యాఖ్యలను ఈసీ కొట్టిపారేసింది. సీఈసీని కలిసినవారిలో మేనకా గురుస్వామి, సాగరికా ఘోష్, సాకేత్ గోకలే ఉన్నారు. 27 లక్షల మంది ఓటర్ల తొలగింపు అంశంలో ఈసీతో చర్చించేందుకు టీఎంసీ ప్రయత్నించింది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
A delegation of the Trinamool Congress met Chief Election Commissioner Gyanesh Kumar in New Delhi over the alleged deletion of nearly 91 lakh voters from electoral rolls in West Bengal.#TheSentinel #TMC #CEC pic.twitter.com/69VKAUByBN
— The Sentinel (@Sentinel_Assam) April 8, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

