కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banarjee)పై వ్యాఖ్యలు చేసిన ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కౌస్తవ్ బాగ్చి(Kaustav Bagchi)ని ఇవాళ ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ 24 ప్రాగ్నాస్ జిల్లాలోని బారక్పోర్లో ఉన్న బాగ్చి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. తెల్లవారుజామున 3.30 నిమిషాలకు ఆయన్ను అరెస్టు చేశారు.
దీదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాగ్చిపై శుక్రవారం బుర్తోల్లా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. బాగ్చిని తన ఇంట్లో అరెస్టు చేశామని, దీని గురించి ఇంత కన్నా ఎక్కువగా ఏమీ మాట్లాడలేమని, తమ ఆఫీసర్లు ఈ అంశాన్ని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇటీవల సాగర్దిగి లో జరిగిన బైపోల్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత అధిర్పై దీదీ ఫైర్ అయ్యారు. ఆ నేపథ్యంలో బెంగాల్ సీఎం వ్యాఖ్యలకు బాగ్చి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఐపీసీ 120బీ, 504, 506 సెక్షన్ల కింద బాగ్చిపై కేసులు నమోదు చేశారు.