పాట్నా, జూలై 8: పక్క పట్టాలపై ఎదురు దిశగా వస్తున్న రైలు ప్రయాణికులపై మరో రైలులోని ఓ ప్రయాణికుడు బెల్టుతో దాడి చేశాడు. బీహార్లోని చప్రా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. పక్క పట్టాలపై ఉన్న రెండు రైళ్లు ఎదురెదురుగా వెళ్తుండగా..ఆ వ్యక్తి బెల్టుతో తలుపుల వద్ద కూర్చున్న ప్రయాణికులపై దాడికి చేశాడు. సైకోలా ప్రవర్తిస్తున్న అతనిపై నెటిజన్లు మండిపడ్డారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమా ండ్ చేశారు. నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఈస్ట్ సెంట్రల్ రైల్వే ట్వీట్ చేసింది.