న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి, పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత దేశానికి అప్పగించేందుకు బెల్జియం కోర్టు ఆమోదం తెలిపింది. బెల్జియన్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడం సరైనదేనని రూలింగ్ ఇచ్చింది.
అయితే, హైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆయనను భారత దేశానికి రప్పించడంలో ఇది చాలా ముఖ్యమైన ముందడుగు అని అధికారులు చెప్పారు. పీఎన్బీని చోక్సీ రూ.13,000 కోట్ల మేరకు మోసగించినట్లు కేసులు దర్యాప్తులో ఉన్న సంగతి తెలిసిందే.