న్యూఢిల్లీ: పెగాసస్ అనే నూతన స్పైవేర్‌తో ప్రతిపక్ష నాయకులు, కేంద్ర మంత్రులపై రహస్య నిఘా వేశారని, ఇందులో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రమేయం ఉన్నదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాహుల్‌గాంధీ సహా అందరు ప్రతిపక్ష నాయకులపై ప్రధాని, హోంమంత్రి స్నూపింగ్‌కు పాల్పడుతున్నారని రాజ్యసభలో కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. ఆఖరికి జర్నలిస్టులు, కేంద్ర మంత్రులపై కూడా స్నూపింగ్ జరుగుతున్నదని ఆయన ఆరోపించారు.
లోక్‌సభ వాయిదా అనంతరం పార్లమెంట్ ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. పెగాసస్ స్పై వేర్‌కు సంబంధించిన దర్యాప్తునకు ముందే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన పదవి నుంచి వైదొలగాలని ఖర్గే డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్రమోదీపై కూడా పెగాసస్ స్నూపింగ్ విషయంలో దర్యాప్తు జరుగాలని ఖర్గే పేర్కొన్నారు.
#WATCH | PM & HM are involved in snooping on Opposition leaders including Rahul Gandhi, journalists & even Union ministers. Before a probe, Amit Shah sahab should resign & an inquiry should be conducted against Modi sahab: LoP in Rajya Sabha, Mallikarjun Kharge on Pegasus report pic.twitter.com/0whMbI1uSH
— ANI (@ANI) July 19, 2021