లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో (Aligarh Muslim University) మెనూపై వివాదం చెలరేగింది. ఆదివారం లంచ్‌లో చికెన్ బిర్యానీకి బదులు బీఫ్ బిర్యానీ ఉంటుందని నోటీస్‌లో పేర్కొన్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ‘టైపింగ్ ఎర్రర్’గా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోని సర్ షా సులైమాన్ హాల్లో ఒక నోటీస్ ఉంది. ‘ఆదివారం భోజన మెనూ మారింది. విద్యార్థుల డిమాండ్ ప్రకారం చికెన్ బిర్యానీకి బదులుగా బీఫ్ బిర్యానీ వడ్డిస్తారు’ అని ఉంది.
కాగా, ఈ మెనూ నోటీస్‌పై యూనివర్సిటీలో తీవ్ర గందరగోళం చెలరేగింది. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ వివాదంపై యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. అనుకోకుండా జరిగిన పొరపాటని వివరించింది. దీనిని ‘టైపింగ్ ఎర్రర్’గా పేర్కొంది.
మరోవైపు అధికారిక సంతకాలు లేని ఆ నోటీస్‌ను తొలగించినట్లు యూనివర్సిటీ తెలిపింది. ఈ నోటీస్‌కు బాధ్యత వహించిన ఇద్దరు సీనియర్ విద్యార్థులకు షో కాజ్ నోటీసు జారీ చేసినట్లు పేర్కొంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని, యూనివర్సిటీ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా తగిన చర్యలు చేపడుతున్నట్లు వివరణ ఇచ్చింది.