Republic Day Beating Retreat | రిపబ్లిక్‌డే క్లోజింగ్ సెర్మోనీ అదుర్స్.. డ్రోన్లతో ఢిల్లీ వాసులకు కనువిందు!
Republic Day Beating Retreat | రిపబ్లిక్ డే ముగింపు వేడుకల సందర్భంగా నిర్వహించిన డ్రోన్ల ప్రదర్శన హస్తిన వాసుల్ని ఆకట్టుకున్నది.

Republic Day Beating Retreat | రిపబ్లిక్ డే ముగింపు వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. శనివారం జరిగిన రిపబ్లిక్ డే ముగింపు వేడుకల్లో బీటింగ్ రీట్రీట్‌లో 100 డ్రోన్ల ప్రదర్శన కనువిందు చేసింది. పది నిమిషాలు నిర్వహించిన ఈ డ్రోన్ల ప్రదర్శన అందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో ఈ డ్రోన్లు రూపొందించారు. ఇక 75 సంవత్సరాల స్వాతంత్య్రం నేపథ్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకునే వేడుకలో భాగంగా డ్రోన్ షో, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో అందరికీ కనువిందు చేసింది.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పలువురు కేంద్రమంత్రులు, త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఈ వేడుకలో పాల్గొన్నారు. యుద్ధ సమయంలో సాయంకాలం వేళ ఇరుపక్షాల సైన్యం వెనక్కు తగ్గుతున్నట్లు సంకేతంగా ఈ బీటింగ్ రీట్రీట్ నిర్వహస్తారు. ఈ సారి వేడుకల్లో కొత్త ట్యూన్లు చేర్చారు. రక్షణ శాఖ సాయంతో కొత్త ట్యూన్లు చేర్చారు. హింద్కి సేన, కేరళ, ఏ మేరే వతన్‌కే లోగోన్ తదితర ట్యూన్లు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన బోట్స్ ల్యాబ్స్ డైనమిక్ స్టార్టప్ డ్రోన్ ప్రదర్శన నిర్వహించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

