న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగం ప్రకారం విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో బీసీలకు వాటా ఇవ్వడంతోపాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కోరినట్టు జాతీయ బీసీ సంఘం నేత ఆర్ కష్ణయ్య తెలిపారు. మంగళవారం రాష్ట్రపతి భవన్లో బీసీ రిజర్వేషన్లపై రాష్ర్టపతితో చర్చించామని వెల్లడించారు.
దేశంలో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సమాన వాటా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీలకు అన్ని రంగాలలో సమాన వాటా ఇచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, ఇంకా పూర్తి స్థాయి న్యాయం కోసం చర్యలు తీసుకొంటామని రాష్ర్టపతి హామీ ఇచ్చారని ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన వారిలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ , లాల్ కృష్ణ, భూపేశ్ సాగర్, రాము, నీల వెంకటేశ్, జెర్రిపోతుల పరుశరావ్ు ఉన్నారు.