కోల్‌కతా: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపబోదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ‘2024లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టేది ఎవరన్న విషయం ఆఎన్నికల్లోనే తేలుతుంది. అంతేతప్ప అసెంబ్లీ ఎన్నికలు దీన్ని నిర్ణయించవు’ అని ఆయన తెలిపారు. 4 రాష్ర్టాల్లో బీజేపీ సాధించిన విజయంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై స్పష్టతవచ్చిందని, దీన్ని రాజకీయ మేధావులు గ్రహిస్తారని ఆశిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొనడంపై ప్రశాంత్‌కిశోర్ ఈ విధంగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్‌సభ ఎన్నికలకు ముడిపెట్టి మోదీ మాట్లాడటం.. విపక్షాలను ఆందోళనలోకి నెట్టి మానసికంగా పైచేయి సాధించేందుకు చేసిన తెలివైన ప్రయత్నమని ప్రశాంత్‌కిశోర్ ట్వీట్ చేశారు.