న్యూఢిల్లీ: బాస్మతి బియ్యం ధరలు అమాంతం పెరగడంతో కొందరు దానిని భారత్-పాక్ ఉద్రిక్తతలకు ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల భారత బియ్యం ఎగుమతుల సంఘం (ఏఐఆర్ఈఏ) కీలక ప్రకటన చేసింది. బాస్మ తి బియ్యం ధరల పెంపునకు, భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలకు సంబంధం లేదని అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్ గోయెల్ తెలిపారు.
డిమాండ్ కారణంగానే బియ్యం ధరలు పెరిగాయని, దానికి ప్రస్తుత ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.