KC Venugopal | ఆ వార్తల్లో నిజం లేదు.. టీఎంసీ విలీనంపై కాంగ్రెస్ క్లారిటీ..!
KC Venugopal | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఖండించింది. అలాంటి చర్చలు ఎక్కడా జరగలేదని స్పష్టంచేసింది. ఈ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కొట్టిపారేశారు.
KC Venugopal : తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఖండించింది. అలాంటి చర్చలు ఎక్కడా జరగలేదని స్పష్టంచేసింది. ఈ వార్తలన్నీ పూర్తిగా నిరాధారమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ (KC Venugopal) కొట్టిపారేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి (Indian Alliance) సమావేశానికి పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee), టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhisheik Banerjee) హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాతే రెండు పార్టీల విలీనంపై ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే ఆ సమావేశంలో జాతీయ రాజకీయ అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని వేణుగోపాల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా సమస్యలను మరింత సమర్థంగా ఎలా లేవనెత్తాలనే అంశంపైనే చర్చ జరిగిందన్నారు. విలీన ప్రతిపాదనగానీ, అలాంటి చర్చలుగానీ అస్సలు జరగలేదని స్పష్టంచేశారు. పశ్చిమబెంగాల్లో ఇటీవల టీఎంసీ తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో అసమ్మతి పెరిగిందన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్తో టీఎంసీ విలీనం కావచ్చన్న ప్రచారం ఊపందుకుంది.
ఇదే అంశంపై టీఎంసీ ఎంపీ సౌగతరాయ్ కూడా స్పందించారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయడం అవసరమని చెప్పారు. అయితే అది కూటమి రూపంలో ఉంటుందా..? విలీనం రూపంలో ఉంటుందా..? అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మరోవైపు విలీనంపై టీఎంసీ అధిష్ఠానం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

