ఇండోర్: సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే ఇవాళ మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లాలో ఉన్న 11వ శతాబ్ధం నాటి భోజ్‌శాల(Bhojshala)-కమల్ మౌలా మసీదు కాంప్లెక్స్‌లో వసంత పంచమి పూజలు నిర్వహించారు. భారీ భద్రత మధ్య పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భక్తులు భారీ సంఖ్యలో ఆ పూజలో పాల్గొన్నారు. సుమారు 8 వేల మంది పోలీసు, పారామిలిటరీ భద్రత ఏర్పాటు చేశారు. వివాదస్పదమైన భోజ్‌శాల-కమల్ మౌలా మసీదులో హిందువులు శుక్రవారం రోజు మొత్తం సరస్వతీ దేవి పూజలు చేసుకోవచ్చు అని గురువారం సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. అయితే మధ్యాహ్నం వేళలో ముస్లింలు కూడా ప్రార్థనలు చేసుకోవచ్చు అని కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
భోజ్ ఉత్సవ కమిటీ ఇవాళ సరస్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్టించిన ప్రత్యేక పూజలు చేశారు. వేదిక మంత్రాల మద్య అఖండ పూజ నిర్వహించారు. భారీ భద్రత మధ్య పూజలు సజావుగా సాగుతున్నాయని జిల్లా మెజిస్ట్రేట్ ప్రియాంక్ మిశ్రా తెలిపారు. ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు వారికి ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. వివాదాస్పద ఆలయ ప్రదేశాన్ని ఆరు సెక్టార్లుగా మార్చారు. ఇక సిటీని ఏడు జోన్లుగా చేసి భద్రత కల్పించారు. భోజ్‌శాలలో సరస్వతీ పూజ చేయడం సంతోషంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సైట్ అర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉన్నది. 2003 నుంచి ఈ ఆలయంలో హిందువులు ప్రతి మంగళవారం సరస్వతీ దేవిని పూజిస్తున్నారు. శుక్రవారం మాత్రం ముస్లింలు ప్రార్థనలు చేస్తారు.
#WATCH | Dhar | Basant Panchami prayers and celebrations being held at Bhojshala, following the Supreme Court order allowing Hindus and Muslims to offer prayers at the Bhojshala-Kamal Maula complex in Dhar, Madhya Pradesh pic.twitter.com/lROdKZHxCN
— ANI (@ANI) January 23, 2026