Asaduddin Owaisi | బరేలీ: పార్లమెంట్లో పాలస్తీనాను కీర్తించి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ యూపీలోని బరేలీకి చెందిన స్థానిక కోర్టు ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సమన్లు జారీ చేసింది. పార్లమెంట్లో ఎంపీగా ప్రమాణం చేస్తున్న సందర్భంగా పాలస్తీనాకు మద్దతుగా ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ నినాదాలు చేశారని ఆరోపిస్తూ వీరేంద్ర గుప్తా అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఒవైసీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పిటిషనర్ ఆరోపించారు.