దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ శుభకార్యాలు నిర్వహించుకునేవారికి తిప్పలు తప్పడం లేదు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ పెళ్లిబృందం భారీ వర్షంలో టార్పాలిన్ కవర్ కింద బరాత్ తీసింది. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను మధ్యప్రదేశ్లోని ఇండోర్లో చిత్రీకరించారు. ‘శైలేందర్ యాదు’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఇండోర్లో భారీ వర్షం కురుస్తున్నా వధువు ఇంటికి చేరుకునేందుకు టార్పాలిన్ షీట్లో బరాత్ నిర్వహించారు. పెళ్లిబృందం అందులోనే నృత్యాలు చేసింది. బరాత్ ముందు కదులుతున్న బస్సులో వరుడు, ఇతర పెళ్లికి వచ్చిన అతిథులు కూర్చున్నారు. ఈ బరాత్ పరదేశిపురలోని క్లర్క్ కాలనీ నుంచి మదన్ మహల్ వైపు వెళ్లగా, చూసినవారంతా ఆశ్చర్యపోయారు. ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నది.
This called pure #dedication #Barat #Indore 😂🤣 pic.twitter.com/0AyZxVzRE2
— शैलेंद्र यादव (@ShailenderYadu) July 6, 2022