యువకుల బ్యాంకు ఖాతాల్లో పొరపాటున రూ.2.44 కోట్లు జమ.. ఆ డబ్బుతో వారు ఏం చేశారంటే?
జరిగిన పొరపాటును ఆ బ్యాంకు గ్రహించింది. అయితే ఇద్దరి యువకుల బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.2.44 కోట్ల డబ్బును అప్పటికే పూర్తిగా విత్ డ్రా చేసినట్లు తెలుసుకుని షాక్ అయ్యింది.
తిరువనంతపురం: ఇద్దరు యువకుల బ్యాంకు ఖాతాల్లో పొరపాటున రూ.2.44 కోట్లు జమ అయ్యాయి. అయితే బ్యాంకు తిరిగి వెనక్కి తీసుకునేలోపు వారిద్దరూ ఆ డబ్బంతా ఖర్చు చేశారు. వ్యక్తిగత రుణాలు తీర్చడంతోపాటు ఖరీదైన ఐఫోన్లు కొన్నారు. పలు బ్యాంకు ఖాతాల్లోకి కొంత డబ్బును మళ్లించారు. స్టాక్ మార్కెట్లో భారీగా ఇన్వెస్ట్ చేశారు. ఇలా ఆ డబ్బంతా ఖర్చు చేశారు. ఈ పొరపాటును గ్రహించిన ఆ బ్యాంకు ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారిని అరెస్ట్ చేశారు. కేరళలోని త్రిసూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఒక బ్యాంకు సర్వర్ మెర్జర్ సందర్భంగా సాంకేతిక సమస్యల వల్ల పొరపాటున ఇద్దరు యువకుల బ్యాంక్ ఖాతాల్లో రూ.2.44 కోట్లు జమ అయ్యాయి.
కాగా, దీనిని గ్రహించిన ఆ ఇద్దరు యువకులు ఈ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లలేదు. పైగా ఆ మొత్తాన్ని బ్యాంకు తిరిగి వెనక్కి తీసుకునేలోపు ఖాతా నుంచి ఆ డబ్బును ఖాళీ చేయాలని నిర్ణయించారు. చాలా ఏళ్లుగా స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న ఆ ఇద్దరూ లక్షలాది డబ్బును స్టాక్మార్కెట్లోకి మళ్లించారు. దీని కోసం 19 బ్యాంకుల్లో 54 కొత్త ఖాతాలు తెరిచారు. అలాగే వారు తీసుకున్న వ్యక్తిగత రుణాలను తీర్చేశారు. ఖరీదైన నాలుగు లేటెస్ట్ మోడల్ ఐఫోన్లను కొన్నారు. ఇలా 171 ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ద్వారా రూ.2.44 కోట్ల డబ్బును ఖర్చు చేశారు.
మరోవైపు జరిగిన పొరపాటును ఆ బ్యాంకు గ్రహించింది. అయితే ఇద్దరి యువకుల బ్యాంకు ఖాతాలో జమ అయిన రూ.2.44 కోట్ల డబ్బును అప్పటికే పూర్తిగా విత్ డ్రా చేసినట్లు తెలుసుకుని షాక్ అయ్యింది. దీంతో ఆ ఇద్దరు యువకులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఎలాంటి నేర చరిత్ర లేని వారిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

