న్యూఢిల్లీ: పొరుగుదేశం బంగ్లాదేశ్ మనపై కవ్వింపు చర్యలు కొనసాగిస్తూనే ఉంది. బంగ్లాదేశ్‌లోని భారత హై కమిషనర్ ప్రణయ్ వర్మకు మంగళవారం సమన్లు జారీ చేసింది. దీంతో వర్మ బంగ్లాదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.
త్రిపుర రాజధాని అగర్తలలోని బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించిన నేపథ్యంలో ఈ సమన్లు జారీచేసినట్టు సమాచారం. అగర్తలలోని బంగ్లాదేశ్ అసిస్టెంట్ హై కమిషన్‌లో అన్ని దౌత్య సేవలు నిలిపివేస్తున్నామని బంగ్లాదేశ్ అధికారి ఒకరు తెలిపారు.