ముంబై: రాజ్యాంగ ప్రతిరూపం ధ్వంసంపై నిరసనలు వెల్లువెత్తాయి. నిరసనకారులు పిలుపునిచ్చిన బంద్ హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పలు వాహనాలకు నిప్పుపెట్టడంతోపాటు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. (Parbhani Violence) మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రైల్వే స్టేషన్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు గాజు పెట్టెలో ఉంచిన రాజ్యాంగ ప్రతిరూపాన్ని మంగళవారం సాయంత్రం ఒక వ్యక్తి ధ్వంసం చేశాడు. ముర్తిజాపూర్ గ్రామానికి చెందిన నిందితుడు సోపాన్ పవార్‌ను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు.
కాగా, ఈ సంఘటనకు నిరసనగా బుధవారం పర్భానీ జిల్లాలో బంద్ జరిగింది. తొలుత ప్రశాంతంగా కొనసాగిన నిరసనలు తర్వాత హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. పర్భానీలో 144 సెక్షన్ విధించారు. శాంతి పునరుద్ధరణ చర్యలపై చర్చించడానికి రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు.
VIDEO | Maharashtra: Violence in Parbhani during a bandh called in the city.
An unidentified person on Tuesday damaged a replica of the Constitution held by the statue of B R Ambedkar outside Parbhani railway station triggering arson and stone-pelting.#Parbhani… pic.twitter.com/yg4dt3g6gO
— Press Trust of India (@PTI_News) December 11, 2024