న్యూఢిల్లీ: కొత్త అదాయ పన్ను బిల్లును పరిశీలించడానికి సెలెక్ట్ కమిటీ ఏర్పడింది. 31 మంది సభ్యులతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ కమిటీని నియమించారు. బీజేపీ ఎంపీ బైజయంత్ పాండాను ఈ కమిటీకి చైర్మన్‌గా ఎంపిక చేశారు.
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌తో పాటు నిశికాంత్ దూబే, జగదీశ్ షెట్టర్, దీపేందర్ సింగ్ హూడా, నవీన్ జిందాల్, సుప్రియా సూలే తదితరులకు ఈ కమిటీలో చోటు దక్కింది. ఫిబ్రవరి 13న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సిందిగా ఆమె స్పీకర్‌ను కోరారు. వచ్చే పార్లమెంటు సమావేశాలనాటికి సెలెక్ట్ కమిటీ తన నివేదికను ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది.