న్యూటెహ్రీ, ఫిబ్రవరి 2: ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో గల బద్రీనాథ్ ఆలయ ద్వారాలు మే 4న ఉదయం ఆరు గంటలకు తెరుచుకుంటాయి. బసంత పంచమి సందర్భంగా టెహ్రీలోని నరేంద్ర నగర్ మాజీ రాజ ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం రాజ పూజారి ఆచార్య కృష్ణ ప్రసాద్ ఉన్నియల్ ఆలయ ద్వారాన్ని తెరిచే తేదీని నిర్ణయించారు. చార్ధామ్లుగా పేరొందిన బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమనునోత్రిలను ప్రతి ఏడాది దీపావళి తర్వాత మూసివేసి తిరిగి ఏప్రిల్, మే నెలల్లో తెరుస్తారు. అనంతరం ఈ ఆరు నెలల కాలంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ చార్ధామ్లను దర్శించుకుంటారు.