Badlapur Case | మహారాష్ట్ర బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో నిందితుడికి థానే జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ప్రైవేట్ స్కూల్లో అటెండర్‌గా పని చేస్తున్న నిందితుడి పోలీస్ కస్టడీ ముగియడంతో భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య కళ్యాణ్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిందని పోలీస్ అధికారి తెలిపారు. ఈ కేసులో పాఠశాల యాజమాన్యంలోని కొంతమందిని కేసులో నిందితులుగా చేర్చారు. లైంగిక వేధింపుల కోసం అటెండర్‌గా పని చేస్తున్న నిందితుడిని ఆగస్టు 17న పోలీసులు అరెస్టు చేశారు.
బద్లాపూర్‌లోని వాష్‌రూమ్‌లో ఇద్దరు కిండర్ గార్టెన్ చదువుతున్న చిన్నారులపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఘటనపై గతవారం విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బద్లాపూర్ స్టేషన్లో పది గంటల పాటు రైల్వేట్రాక్‌లపై నిరసన చేస్తూ రైళ్లరాకపోకలను అడ్డుకున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, పాఠశాల సైతం దాడి చేశారు. ఈ ఘటనపై విచారణకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్తీ సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిరసన సందర్భంగా రైల్వేస్టేషన్‌తో పాటు బద్లాపూర్‌లోని ఇతర ప్రాంతాల్లో రాళ్ల దాడిలో కనీసం 25 మంది పోలీసులు గాయపడ్డారు.