చెన్నై: మనిషైనా, పశుపక్ష్యాదులైన బిడ్డపై కన్నతల్లికి ఉండే ప్రేమకు ఏదీ సాటిరాదు. తాను జన్మనిచ్చిన దూడను ఎత్తుకెళ్తున్నారని భావించిన ఓ ఆవు కారు వెనుకాల ఏకంగా రెండున్నర కిలోమీటర్లు పరుగెత్తింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. శివగంగా జిల్లాలోని కండరమాణిక్యం గ్రామానికి చెందిన ఓ రైతుకు ఆవు ఉన్నది. అది మేతకు వెళ్లి పొన్నకుడి ప్రాంతంలో దూడకు జన్మనిచ్చింది. విషయం తెలిసిన రైతు.. ఆవును, దూడను ఇంటికి తీసుకురావడానికి వెళ్లాడు. దూడను కారు డిక్కీలో ఎక్కించుకొని వెళ్తుండగా.. తన బిడ్డను ఎత్తుకెళ్తున్నారేమోనని భావించిన ఆ ఆవు ఏకంగా రెండున్నర కిలోమీటర్లు పరుగుతీసింది. ఈ దృశ్యాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.