బెంగళూరు: అయోధ్య రామమందిరం ప్రా రంభోత్సవం వేళ కాంగ్రెస్ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మె ల్సీ బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ.. 2002లో గుజరాత్లోని గోద్రాలో జరిగినట్టుగానే ఇప్పుడు కర్ణాటకలోనూ దుర్ఘటన జరిగే అవకాశం ఉన్నదన్నారు. రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా దుర్ఘటన జరగవచ్చన్నారు. గుజరాత్లోని గోద్రాలో ఈ సమయంలోనే కరసేవకులు ప్రయాణిస్తున్న రైలును తగులబెట్టారని, అందువల్ల కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయోధ్యకు వెళ్లాలనుకునేవారి కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుమారుడు య తీంద్ర మాట్లాడుతూ, ఇండియా హిందూ దేశమై తే, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లా మారుతుందని, ని యంతృత్వ ప్రభుత్వాలు రాజ్యమేలుతాయన్నా రు.