శ్రీనగర్: ఈ లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవచ్చునని డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) అధ్యక్షుడు, మాజీ సీఎం గులామ్ నబీ ఆజాద్ తెలిపారు. ఈ ఎన్నికల్లో అనంత్‌నాగ్-రాజౌరి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్టు పార్టీ తన పేరు ప్రకటించిందని, అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే విషయంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 2022లో కాంగ్రెస్‌ను వీడి కొత్తగా పార్టీ స్థాపించిన ఆజాద్ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే అయనకు అది తొలి పరీక్షగా నిలుస్తుందని భావిస్తున్నారు. కాగా, ఆజాద్ ప్రకటనపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. ‘ఆజాద్‌కు బీజేపీ నుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ పార్టీ కోసం తప్పుకోవాలని అనుకుంటున్నారు’ అని విమర్శించారు.