న్యూఢిల్లీ, జూలై 21(నమస్తే తెలంగాణ): భీమ్ ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్‌పై ఇటీవల జరిగిన కాల్పుల ఘటనను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. ఈ సంఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్ నేత, పీ రాములు డిమాండ్ చేశారు. ఆజాద్‌పై కాల్పుల ఘటనను నిరసిస్తూ భీమ్ ఆర్మీ, ఆజాద్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ ఎం పీలు మద్దతు ప్రకటించారు. దళితులు, బడుగు, బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులను ప్రశ్నిస్తున్నందుకే ఆజాద్‌పై దాడి చేశారని విమర్శించారు.