పాతానమిట్టై: కొత్తగా పెళ్లి అయిన దంపతులు(Newly Married Couple).. కేరళలో జరిగిన కారు, బస్సు ప్రమాదంలో మృతిచెందారు. మురింజకల్లో ఆ ప్రమాదం జరిగింది. నవంబర్ 30వ తేదీన ఆ జంట పెళ్లి చేసుకున్నది. పెళ్లి అయిన 20 రోజుల్లోనే ఆ జంట ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళ్తే.. అను, నిఖిల్ .. రాష్ట్ర పునలూరు హైవేపై జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. హానీమూన్ కోసం మలేషియాకు వెళ్లిన ఆ జంట .. తిరిగి ఇంటికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ జంటకు చెందిన పేరెంట్స్ కూడా ఆ ప్రమాదంలో మృతిచెందారు.
బీజూ అనే వ్యక్తి కారు నడుపుతుండగా ప్రమాదం జరిగింది. ఏపీ నుంచి వచ్చిన అయ్యప్ప యాత్రికుల బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. పూనకావు చర్చి సమీపంలో ఉన్న శ్మశానవాటికలో ఇవాళ ఆ నలుగుర్ని ఖననం చేశారు. ఆ కొత్త జంట నవంబర్ 30న పెళ్లి చేసుకోవడానికి ముందు 8 ఏళ్ల పాటు రిలేషన్లో ఉన్నది. మలేషియాలో హానీమూన్ ట్రిప్ పూర్తి చేసుకున్న ఆ జంట.. బంధువుల్ని కలిసేందుకు వెళ్లి ప్రమాదానికి గురయ్యారు. ఇంటికి ఏడు కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగింది.