అహ్మదాబాద్, ఏప్రిల్ 20: దేశంలో తయారయ్యే సంప్రదాయ ఔషధ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, వాటి నాణ్యతను నిర్ధారించేందుకు ఆయుష్ మార్క్‌ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని తెలిపారు. అలాగే ఆయుష్ వైద్యం తీసుకోవాలనుకొనే విదేశీయుల కోసం ప్రత్యేకంగా ఆయుష్ వీసాను కూడా అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న స్వరాష్ట్రం గుజరాత్లో ప్రధాని మోదీ బుధవారం రూ. 22 వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. గాంధీనగర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్‌తో కలిసి ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ నడించింది. తనకు ఓ గుజరాతీ పేరు పెట్టాలని మోదీని అధనోమ్ కోరగా.. తులసీభాయ్‌గా ఆయనకు మోదీ పేరు పెట్టారు.