లక్నో, ఫిబ్రవరి 12 : అయోధ్యలోని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం కన్నుమూశారు. ఫిబ్రవరి 3న బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 85 ఏళ్ల దాస్‌ను ఇక్కడి సంజయ్ గాంధీ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎస్జీపీజీ)లో చేర్చగా బుధవారం ఆయన తుది శ్వాస విడిచారని దవాఖాన తెలిపింది. సత్యేంద్ర దాస్ మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన తన జీవితాన్ని శ్రీరాముడి సేవకు అంకితం చేశారని పేర్కొన్నారు. తన 20వ ఏట సన్యాస దీక్ష తీసుకున్న సత్యేంద్ర దాస్ 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో రామ జన్మభూమి ఆలయ పూజారిగా ఉన్నారు.