Balak Ram | బెంగళూరు: అయోధ్య బాలరాముడి విగ్రహాన్ని రూపొందించేందుకు వందల కోట్ల ఏండ్ల నాటి కృష్ణ శిలను(నల్ల రాయి) గుర్తించినందుకు శ్రీనివాస్ నటరాజ్ అనే చిన్న కాంట్రాక్టర్‌కు కన్నీరు మిగిలింది. ఒక ప్రైవేట్ స్థలంలో అక్రమంగా మైనింగ్ చేశారని ఆరోపిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్, భూగర్భ శాఖ ఆయనకు రూ.80 వేల జరిమానా విధించింది.
జరిమానాను చెల్లించేందుకు శ్రీనివాస్ తన భార్య బంగారం నగలను తాకట్టు పెట్టాల్సి వచ్చిందని స్థానిక మీడియా పేర్కొన్నది. మైసూర్ సమీపంలోని గుజ్జెగౌదనపుర అనే గ్రామానికి చెందిన రామదాస్ అనే రైతుకు చెందిన పొలంలో రాళ్లను తొలగించేందుకు శ్రీనివాస్‌కు ఒక కాంట్రాక్టు వచ్చింది. ఈ క్రమంలో ఒక పెద్ద రాయిని మూడు భాగాలుగా చేశామ ని, అందులో ఒకదాన్ని బాలక్‌రామ్ విగ్రహ రూపకల్పన కోసం ఎంచుకొన్నారని శ్రీనివాస్ నటరాజ్ తెలిపారు.