అయోధ్య: అయోధ్య(Ayodhya)లో రెండు నెలల క్రితం జరిగిన సామూహిక అత్యాచార ఘటన నిందితుడు మొయిద్ ఖాన్‌కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌ను ఇవాళ బుల్డోజర్లతో కూల్చివేశారు. అతను సమాజ్‌వాదీ పార్టీకి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూలై 30వ తేదీన అయోధ్య పోలీసులు మొయిద్ ఖాన్‌ను అరెస్టుచేశారు. జిల్లాలోని పురకలందార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భదార్సా నగర్ లో ఓ బేకరీ అతనికి ఉండేది. ఆ బేకరీలో పనిచేసే రాజూ ఖాన్‌తో కలిసి నిందితుడు 12 ఏళ్ల అమ్మాయిని రెండు నెలల క్రితం రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు గర్భవతి అని తేలడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇవాళ మధ్యాహ్నం 1.30 నిమిషాలకు భదార్సా పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్‌ను కూల్చివేశారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నది. కూల్చివేతకు ముందు దాంట్లో ఓ బ్యాంక్‌ను ఆపరేట్ చేశారు. ప్రభుత్వ భూమిపై అక్రమంగా ఆ కాంప్లెక్స్‌ను నిర్మించినట్లు మెజిస్ట్రేట్ సోహెల్ ఏకే సైనీ తెలిపారు.
#WATCH | Ayodhya gang-rape incident | Police and administration carry out demolition drive at shopping complex owned by accused Samajwadi Party leader, for illegal construction. pic.twitter.com/6MZES3NW1z
— ANI (@ANI) August 22, 2024