న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రముఖ జీవరసాయన శాస్త్రవేత్త(బయోకెమిస్ట్) గోవిందరాజన్ పద్మనాభన్ మొదటి ‘విజ్ఞాన్ రత్న’ పురస్కారానికి ఎంపిక అయ్యారు. కేంద్రం బుధవారం మొత్తం 33 రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలను ప్రకటించింది.
ఇందులో యువ శాస్త్రవేత్తలకు ఇచ్చే 18 విజ్ఞాన్ యువ పురస్కారాలతో పాటు 13 విజ్ఞాన్ శ్రీ పురస్కారాలు ఉన్నాయి. విజ్ఞాన్ టీమ్ అవార్డు చంద్రయాన్-3 బృందానికి దక్కింది. సైన్స్‌లో శాస్త్ర, సాంకేతిక భాగస్వామ్యం, గొప్ప ఆవిష్కరణలకు ఇచ్చే ఈ అత్యున్నత అవార్డులను కేంద్రం ఈ ఏడాది ప్రారంభించింది.