Srinagar : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ – లేహ్ మార్గంలో హిమపాతం (Avalanche) విధ్వంసం సృష్టించింది. మంచు కొండలు విరిగి పడిన ఘటనలో ఏడుగురు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు. పన్నెండకు పైగా కార్లు మంచులో కూరుకుపోయాయి. శుక్రవారం మధ్యాహ్నం జీరో పాయింట్, మినిమార్గ్ మధ్య ప్రాంతంలో మంచు చరియలు ఒక్కసారిగా జాతీయ రహదారిపైకి దూసుకొచ్చాయని అధికారులు తెలిపారు.
శ్రీనగర్ – లేహ్ మార్గంలో హిమపాతం ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి.. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. లద్ధాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తాను సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నానని ఎక్స్ వేదికగా తెలిపారు.
Heard the unfortunate news of an avalanche at Zoji La. I have directed the DC & SSP of Kargil to visit the spot immediately and mobilise relief and rescue operations.
All government agencies including disaster relief forces and BRO have been put on high alert.
I am personally…
— LG Ladakh (@lg_ladakh) March 27, 2026
‘జోజి లా మార్గంలో మంచు కొండలు విరిగిపడ్డాయనే దురదృష్టకరమైన వార్త విన్నాను. వెంటనే కార్గిల్ జిల్లా కలెక్టర్, ఎస్ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించాను. అన్రి ప్రభుత్వ ఏజెన్సీలు, విపత్తు నిర్వహణ దళాలు, సరిహద్దు రోడ్డు సంస్థ (బీఆర్వో)లు అప్రమత్తమయ్యాయి. నేను వ్యక్తిగతంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాను’ అని వీకే సక్సేనా చెప్పారు.