గద్వాల, జూలై 29 : ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వస్తుండడంతో జూరాల ప్రాజెక్టు నీటితో జ లకళను సంతరించుకున్నది. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుం చి దిగువకు కృష్ణమ్మ పరుగులు పె డుతుండడంతో జూరాల డ్యాంకు ఇన్‌ఫ్లో 32,500 క్యూసెక్కులకు చే రింది.
పీజేపీ పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా ప్ర స్తుతం 317.06 మీటర్లు నిల్వ ఉం డగా.. ఫుల్ లెవల్ 9.657 టీఎంసీ లు ఉండగా.. ప్రస్తుతం 6.841 టీ ఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుదుత్పత్తికి 35,913 వేల క్యూసెక్కులు, నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 1500 క్యూసెక్కు లు, భీమా లిఫ్ట్-1కు 1300క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌నకు 630 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కులు, జూరాల ఎడ మ కాల్వకు 1030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 500 క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదులుతున్నారు. మొత్తం అవుట్‌ఫ్లో 41,520 క్యూసెక్కులుగా నమోదైంది.