ముంబై, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఒకరిద్దరు కాదు.. ఏకంగా 180 మంది బాలికలను ఒక యువకుడు ట్రాప్ చేసి లైంగికంగా వేధించిన ఉదంతం మహారాష్ట్రలో వెలుగుచూసింది. దీంతో నిందితుడి ఇంటిని మహారాష్ట్ర అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు. అమరావతి పరిధిలోని పరాట్వాడా పట్టణానికి చెందిన 19 ఏండ్ల అయాజ్ దాదాపు 180 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించడమే కాకుండా.. 350 వీడియోలను రహస్యంగా చిత్రీకరించాడు.
అమ్మాయిలను ట్రాప్ చేసి ముంబై, పుణె నగరాలకు తీసుకెళ్లేవాడు. తర్వాత వారిని బ్లాక్మెయిల్ చేసేవాడు. అందంగా ఉన్న అమ్మాయిలను వ్యభిచారంలోకి దింపి సొమ్ము చేసుకునే వాడు. కొన్ని వీడియోలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేవాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానిక బీజేపీ ఎంపీ అనిల్బోండే పోలీసులకు ఫిర్యాదు చేశారు.