Watch: ఆటో నడిపి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చిన.. ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్
Nicholas McCaffrey | ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్ నికోలస్ మెక్కాఫ్రీ (Nicholas McCaffrey) భారత్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయానికి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని ఆస్ట్రేలియా ఎంబసీ ప్రవేశ ద్వారం వరకు భారత జాతీయ పతాకం రంగులు ఉన్న ఆటోను స్వయంగా నడిపారు. భారతీయ సంప్రదాయ పద్ధతిలో ‘నమస్తే’ అని అభివాదం చేశారు.
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా కొత్త డిప్యూటీ హైకమిషనర్ నికోలస్ మెక్కాఫ్రీ (Nicholas McCaffrey) భారత్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయానికి వినూత్నంగా ఎంట్రీ ఇచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని ఆస్ట్రేలియా ఎంబసీ ప్రవేశ ద్వారం వరకు భారత జాతీయ పతాకం రంగులు ఉన్న ఆటోను స్వయంగా నడిపారు. అనంతరం భారతీయ సంప్రదాయ పద్ధతిలో ‘నమస్తే’ అని అక్కడున్న వారికి అభివాదం చేశారు. భారత్‌లో ఆస్ట్రేలియా డిప్యూటీ హైకమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ నేతృత్వంలో తమ దేశ బృందంతో కలిసి పని చేస్తానని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, అభివృద్ధి కోసం ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ పని చేస్తున్నారని కొనియాడారు. సారా స్టోరీ స్థానంలో తన వంతు పాత్ర నిర్వహిస్తానని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆటో నడిపిన వీడియో క్లిప్‌ను అందులో షేర్ చేశారు.
మరోవైపు భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్, దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పర్యటించారు. వారణాసి, జైపూర్, కోల్‌కతా, అహ్మదాబాద్ వంటి నగరాలను ఇప్పటికే ఆయన సందర్శించారు. విభిన్న భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతి అందాలను ఆస్వాధించిన అనుభవాలను ఎక్స్‌లో షేర్ చేశారు.
नमस्ते इंडिया 🙏| Terrific to start as Australia's Deputy High Commissioner in India, replacing the irrepressible Sarah Storey. Look forward to working with #TeamAustralia in India, under the leadership of @AusHCIndia Philip Green. #autorickshaw 🛺@SenatorWong #dosti 🇦🇺🇮🇳 pic.twitter.com/kkuZoPVgRm
— Nick McCaffrey (@AusDHCIndia) December 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

